Home  »  Bollywood News  »  shah rukh khan: షారుఖ్ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే.. ఎందుకు ఇలా చేసారు!

Updated : Jul 14, 2026

 

 

ఎన్నో సంవత్సరాల నుంచి అభిమానులని అలరిస్తూ వస్తున్న షారుక్ ఖాన్ ప్రస్తుతం కింగ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రీవియస్ మూవీ 'డంకీ' పరాజయం చెందటంతో ఈ సారి   'కింగ్' తో అదిరిపోయే హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక షారుక్  కలల సౌధం, ముంబైలోని  ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటైన 'మన్నత్' బంగళాకి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 


ముంబై బాంద్రా తీరంలో ఉన్న 'మన్నత్' లో అదనపు నిర్మాణాల కోసం షారుక్ కి లభించిన  పర్యావరణ అనుమతులని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. దీంతో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ తమ ఇంటిని మరింత అందంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉన్న అన్ని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ తీర్పుతో షారుఖ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే, షారుఖ్ ఖాన్ తన ప్రస్తుత 6 అంతస్తుల 'మన్నత్' బంగళాపై మరో 2 అదనపు నివాస అంతస్తులని  (7వ మరియు 8వ అంతస్తులు) నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రతిపాదిత నిర్మాణంలో ఒక అంతర్గత మెట్ల మార్గంతో కూడిన భారీ డ్యూప్లెక్స్ నివాస యూనిట్ ఉండబోతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ముంబై తీర ప్రాంతంలో ఉండటంతో, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనల ప్రకారం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (MCZMA) నుండి 2025 జనవరి 3న దీనికి అవసరమైన అనుమతులు లభించాయి. అంతేకాకుండా, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (MCGM) కూడా 2024 నవంబర్ 7నే ఈ బిల్డింగ్ ప్లాన్లకి ఆమోదం తెలిపింది.

అయితే, ముంబైకి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సంతోష్ దౌండ్కర్ ఈ అనుమతులని  తీవ్రంగా వ్యతిరేకించారు. సినిమా స్టార్ అనే కారణంతోనే షారుఖ్‌కు ఈ నిబంధనల సడలింపులు లభించాయని, కోస్టల్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ నిర్మాణం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై దౌండ్కర్ మొదట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) పూణే బెంచ్‌ను ఆశ్రయించారు. కానీ, 2025 సెప్టెంబర్‌లో ఎన్జీటీ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఈ నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని స్పష్టం చేసింది. ఎన్జీటీ ఇచ్చిన ఆ తీర్పును సవాలు చేస్తూ దౌండ్కర్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.


Also read: రాకాలో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ స్కెచ్ మాములుగా లేదుగా!


ఈ కేసుని  విచారించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ వాదనలను పూర్తిగా త్రోసిపుచ్చింది. సెలబ్రిటీ హోదాను చూసి తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని, చట్టం అందరికీ ఒకటే. వారు అక్కడ నివసిస్తున్నారు, తమ సొంత నివాస గృహంలో అదనపు అంతస్తులు నిర్మించుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక. దీనివల్ల పొరుగువారికి గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జరుగుతుంది. చట్టపరమైన నిబంధనలని ఇక్కడ పూర్తిగా పాటించారు" అని ధర్మాసనం పేర్కొంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.